ఉలవలు.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేనివి. ముఖ్యంగా ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు ఒక్కసారి రుచి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు అని అంటుంటారు. ఇక ఉలవలు.. నవ ధ్యాన్యాలో ఒకటి. అలాగే ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో అర్థం చేసుకోవచ్చు. మేలైన ఆహారంగానే గాక పశువుల దాణాలోనూ ఉలవల వినియోగం విరివిగా కనిపిస్తుంది.
అయితే ఈ ఉలవలతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి.
అదేవిధంగా, ఉలవలను తీసుకోవడం వల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. మరియు అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి. మేలైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి, చల్లారిన తరువాత పిండిపట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. అయితే రోజూ ఉలవలు తినటం వల్ల వేడి చేస్తుంది. అందుకే ఉలవలు తిన్నరోజున మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి