క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ ప్రాణాంత‌క‌ర మహమ్మారి జన్మస్థానం చైనాలోని వుహాన్ అన్న సంగ‌తి తెలిసిందే. అక్కడి ప్రఖ్యాత వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ బయటికి వ్యాపించిందన్న ఆరోపణలు ఎప్పుటిక‌ప్పుడు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ ఖండిస్తూనే ఉంది. అయితే ఈ క‌రోనా వైర‌స్ ఎలా పుట్టింది అన్న దానికి ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌మైన ఆధారాలు అయితే లేవ‌నే చెప్పాలి. అయితే ఈ వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.

 

దీంతో క‌రోనా అన్న పేరు వింటేనే ప్ర‌జ‌లు ఆమ‌డ దూరం పారిపోతున్నారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే కొంద‌రిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకున్నా క‌రోనా సోకుతుంది. అందుకే ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అందరూ మహమ్మారి బారిన పడకుండా ఉండడానికి తమకు తోచినట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వాస్త‌వానికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే వైరస్‌ల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 

 

అయితే ఇప్పుడు చెప్పబోయే టీ కూడా మీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందుకు ముందుగా మీరు కొంచెం నీళ్లలో తులసి ఆకులు, పసుపు, దాల్చిన చెక్క, లవంగం వేసి బాగా వేడి చేసి ఆ నీళ్లు తాగండి. తులసి ఆకులు, పసుపు యాంటీ బ్యాక్టీరియల్‌గా బాగా పనిచేస్తాయి. మ‌రియు లవంగాలు గొంతు నొప్పిని కలిగించే బ్యాక్టీరియాలను అంతం చేయ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. మ‌రియు వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ ను శరీరంలో తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ఎఫెక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇక ఈ టీ తాగ‌డంతో పాటు తగిని జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి. 

  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: