ప్ర‌స్తుతం విరివిగా దొరికే నల్ల ద్రాక్ష చాలా మంది ఇష్టంగా తింటారు. రుచిక‌రమైన స‌లాడ్ త‌యారీలో, చాలామంది ఇష్ట‌ప‌డే వైన్ త‌యారీలో ఉప‌యోగ‌ప‌డే ఈ న‌ల్ల ద్రాక్ష సూప‌ర్ ఫుడ్ అని చెప్పుకోవాలి. నల్లటి ద్రాక్షలో విటమిన్-సి‌, విటమిన్‌-ఏ, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, ఐర‌న్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నోరకాల ఖనిజలవణాలు ద్రాక్షలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే  ఏ వయసు వారయినా రోజూ కొన్ని న‌ల్ల ద్రాక్షలు తింటే ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ఇక వీటికి తిన‌డానికి తొక్క తీయాల్సిన అవ‌స‌రం లేదు. కోయాల్సిన అవ‌స‌రం లేదు. గింజ‌ల బాధ అస‌లే ఉండ‌దు.

 

ఇక తింటున్న‌ప్పుడు ర‌సం కారుతుంద‌న్న ఇబ్బందీ ఉండ‌నే ఉండ‌దు. ఇలా నోట్లో వేసుకొని అలా గుటుక్కుమనిపిస్తే స‌రి.. అందుకే చాలామంది వీటిని తినేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. అయితే న‌ల్ల ద్రాక్ష వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా బాగానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మధుమేహ రోగులకు నల్లద్రాక్ష తినటం ఎంతో మంచిదని అది మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు సహకరిస్తుందని ప‌రిశోధ‌న‌లో తేలింది. వాస్త‌వానికి మధుమేహ వ్యాధి రోగులు, తమకున్న చక్కెర వ్యాధి అంటే తీపి వ్యాధి కారణంగా.. మామిడి, సపోటా వంటి తియ్యటి పండ్లను తినడానికి వెనుకాడతారు. 

 

అటువంటివారు, వాటికి బదులుగా పుల్లని నల్లద్రాక్షను తింటే, లేదా ప్రతిరోజూ నల్లద్రాక్ష రసం ఒక గ్లాసుడు తాగితే కొద్దిరోజులలో రక్తంలోని షుగర్ నిల్వలు తగ్గి, ఆరోగ్యం చేకూర్చే అవకాశం వుంటుంది. ఇక నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్షల్ని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవు. పాలీఫినోల్స్‌గా పిలిచే ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నల్లద్రాక్షలో ప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్‌ మైగ్రెయిన్‌ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. సో, వీటిని మీ డైలీ డైట్‌లో చేర్చుకుంటే స‌రి.

  
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: