ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... నిద్రలేమితో రక్తంలో సి రియాక్టివ్‌ ప్రోటీన్‌ వంటి వాపు ప్రక్రియ సూచికల స్థాయులు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమితో తలెత్తే మరో సమస్య మానసిక ఒత్తిడి. దీంతో నిద్ర సరిగా పట్టదు. నిద్ర సరిగా పట్టకపోవటం ఇంకాస్త ఒత్తిడికి దారితీస్తుంది. చివరికిదో విష వలయంలా తయారవుతుంది. మన నిద్ర, మెలకువలు జీవ గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) మీదే ఆధారపడి ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థనూ నియంత్రిస్తుంది. జీవ గడియారం అస్తవ్యస్తమైతే నిద్ర తీరుతెన్నులు, రోగనిరోధకవ్యవస్థ పనితీరూ దెబ్బతింటాయి. ఫలితంగా వాపు ప్రక్రియా ప్రేరేపితమవుతుంది.  నిద్రలేమితో కార్టిజోల్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. గుండె వేగం, రక్తపోటును పెంచే దీని స్థాయులు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉండటవ ప్రమాదమే. దీంతో వాపు ప్రక్రియ సూచికల స్థాయులు పెరగటమే కాదు, రోగనిరోధక ప్రతిస్పందనలూ తగ్గుతాయి.

రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవచ్ఛు పెద్దవాళ్లు రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. పడుకోవటానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించెయ్యాలి. అలాగే పడుకోవటానికి గంట ముందు నుంచే ఇంట్లో వెలుతురు తగ్గేలా చూసుకోవాలి. కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటి డిజిటల్‌ పరికరాలన్నీ కట్టేయాలి.

ఇవి పడక గదిలోకి లేకుండా చూసుకోవటం ఉత్తమం. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఉదయం పూట ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. సాయంత్రం వేళల్లో కెఫీన్‌తో కూడిన పదార్థాలు, పానీయాలు తీసుకోకూడదు. మద్యానికి దూరంగా ఉంటే మేలు.బాగా గురక పెడుతున్నా, పగటి పూట మత్తుగా అనిపిస్తున్నా నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తే సమస్య (స్లీప్‌ అప్నియా) ఉందేమో పరీక్షించుకోవాలి. తాత్సారం చేయకుండా తగు చికిత్స తీసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: