సీతాఫలం పండు చలికాలంలో మాత్రమే దొరుకుతుంది.ఈ పండు చాలా తియ్యగా ఉంటుంది. లోపల గింజల గింజలు గా ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయి.ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

 సీతాఫలం చెట్టు లో అన్ని భాగాలు ఔషధాలు గా ఉపయోగపడతాయి. బెరడు,ఆకులు, వేరు ఇలా అన్ని భాగాలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. సెగ గడ్డలతో బాధపడుతున్న వాళ్లు,సీతాఫలం చెట్టు ఆకులు మెత్తగా నూరి గడ్డపై పెట్టుకోవడం వల్ల సెగ గడ్డలు కరుగుతాయి.ఇంకా మధుమేహానికి కూడా ఈ ఆకులు వాడుతారు.

 డయేరియా ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు సీతాఫలం బెరడును బాగా మరిగించి డికాషన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ తాగడం వల్ల డయేరియా వ్యాధి తగ్గుతుంది.

 జీర్ణక్రియ వేగవంతం గా జరగడానికి సీతాఫలం పండును రసం రూపంలో కాకుండా నేరుగా తీసుకోవడం వల్ల నోటిలో జీర్ణరసాలు పెరిగి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

 పిల్లలకు సీతాఫలం గుజ్జును తీసుకొని రసంలా తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల శక్తి లభిస్తుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి లేదా రెండు పండ్లు తినిపించడం వల్ల పాస్పరస్,ఇనుము వంటి పోషకాలు బాగా అందుతాయి.

సీతాఫలం పండు రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

చర్మవ్యాధులను నయం చేయడానికి సీతాఫలం పండు బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఈ పండు లో సల్ఫర్ అధికంగా ఉంటుంది.ఇంకా శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపిస్తుంది.

 గాయాలు మానడానికి ఈ చెట్టు ఆకులు మెత్తగా నూరి పసుపు కలిపి గాయాల పైన రాయడం వల్ల గాయాలు మానుతాయి.ఇందులో హైడ్రో సైనిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లము చర్మ సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది. గజ్జి, తామర వంటి వాటిని కూడా.

 విరోచనాలతో బాధపడుతున్న వాళ్లకి సీతాఫలం చెట్టు బెరడును కషాయంగా చేసుకుని తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.

 కండరాల నొప్పులు, నరాల బలహీనతలు ఉన్నవాళ్లు సీతాఫలం పండు ను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: