గోరు చిక్కుడు కాయలు సాధారణంగా ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్క. దీన్నే ఇంగ్లీషులో క్లస్టర్ బీన్స్ అంటారు. మన దేశంలో గోరు చిక్కుడు కాయలను సాంబారు, పచ్చడి, పులుసు, ఫ్రై చేసుకొని ఎక్కువగా తింటుంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో గోరుచిక్కుడు కాయలను ఆహారంగా తాలింపు రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతారు.గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి.          

గోరు చిక్కుడు లో  అధికంగా ఫైబర్ ఉంటుంది కావున రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది.

గోరుచిక్కుడుకాయ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయపడుతుంది.

గోరు చిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్స్ , ఖనిజ లవణాలు ఎక్కువ వీటిని తినడం వల్ల క్యాలరీలు తగ్గి శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోతుంది తద్వారా అధిక బరువు సమస్య నుంచి దూరం కావచ్చ

గోరుచిక్కుడు కాయలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది . కావున రక్తహీనత సమస్యలు తొలగుతాయి.

గోరుచిక్కుడు కాయలో యాంటీఆక్సిడాంట్లు మీ చర్మంలో దెబ్బతిన్న కణాలను తొలగించడానికి చాలా సహాయకారిగా ఉంటాయి.

కంటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గోరుచిక్కుడు  ను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

గోరుచిక్కుడు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తాయి తద్వారా మధుమేహం అన్న సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ! గోరుచిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మెడిసిన్ తీసుకునేవారు వీటిని ఆహారంగా తీసుకోకపోవడమే మంచిది.ఎందుకంటే ఇవి మనం తీసుకునే మెడిసిన్ (టాబ్లెట్) కు విరుగుడుగా పనిచేస్తాయి. ఒకవేళ తినాల్సి వస్తే ఆరోజు మందులను వేసుకోవడం మానివేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: