ముల్లంగి కూర అంటే చాలామంది ఇష్టపడరు. అంటే వాసన అలా ఉంటుంది. కానీ కూర చేసుకుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముల్లంగి గురించి సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని తినకుండా ఉంటారు. కానీ ముల్లంగి లో  ఎన్నో ఔషధ గుణాలున్నాయని తెలిస్తే మాత్రం అని కూడా చూడకుండా తింటారు. రోజు  ఆహార భాగం లో ముల్లంగిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ముల్లంగి  ఆకులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..,

 ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా అందుతాయి. ఇవి శరీరం యొక్క పనితీరును బాగా మెరుగు పడడానికి  సహాయ పడతాయి.

 ముల్లంగి ఆకుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్, పోలిక్ యాసిడ్ లు మరియు పాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలో అనేక విధులు నిర్వర్తించడానికి ఇవి సహాయపడతాయి.

 ముల్లంగి ఆకులు ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం సమస్య ను తగ్గిస్తుంది. మలబద్దక  సమస్యలను కూడా నివారిస్తుంది. ముల్లంగి లో కంటే ముల్లంగి ఆకులను డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

 ముల్లంగి ఆకులు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైటేరియన్ అలసటను నివారిస్తుంది. ముల్లంగి లో పాస్పరస్, ఐరన్ మంచి ఉండటంవల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. విటమిన్ సి, విటమిన్  ఏ వంటివి  ఉండడం వల్ల అలసటను, నీరసమును నివారించడం లో బాగా సహాయపడతాయి. అంతేకాకుండా హిమోగ్లోబి శాతం తక్కువగా ఉన్న వాళ్ళు ఆకుల రసం తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

 ముల్లంగి ఆకులు ఫైల్స్ ను ని రించడానికి  బాగా పనిచేస్తాయి. ఫైల్స్ ఉన్న వాళ్లకి పెయిన్ ఫుల్ కండిషన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి పైల్స్ లక్షణాలను,  వాపును తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: