మన శరీరంలో కొన్ని బాగాలు ఉంటాయి. ఆ బాగాలలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. కిడ్నీలు కనుక ఒక్కసారి ఫెయిల్ అయితే ఇక చావు ఒక్కటే మార్గం. అలా కిడ్నీ సమస్యలు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం తినే ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.అలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇక ఈ ఆకు కూరలు తినటం వలన ఎలాంటి కిడ్నీ సమస్యలు వుండవు. అవేంటంటే....


మనం రోజు కూరల్లో ఉపయోగించే కరివేపాకు.. ఇక శరీరంలోని విష వ్యర్థాల్ని తరిమేస్తాయి. దగ్గు, జలుబులకు చెక్ పెట్టే సామర్థ్యం ఉన్న కరివేపాకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కరివేపాకు తీసుకుంటే మంచిది. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కరివేపాకు సహాయపడుతుంది.పాలకూరలో విటమిన్ ‘కె’ స‌మృద్ధిగా ఉంటుంది. కాల్షియం, నైట్రేట్స్, విటమిన్ ఎ కూడా ఎక్కువే. కిడ్నీ సంబంధ వ్యాధులు, మూత్ర నాళం సమస్యలతో సతమతమయ్యే వారికి పాల కూర మంచి ఆహారం.


ఐరన్, పీచు పదార్థం ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా తీసుకోవచ్చు. కంటి సంబంధ వ్యాధులు, ఎముకల వ్యాధులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.ఇక గోంగూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే.గోంగూరలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే.ఇక రక్త ప్రసరణ మెరుగుపరచడంతో పాటు బ్లడ్‌లో ఇన్సులిన్‌ స్థాయిలను పెంచే గుణం గోంగూరకు ఉంది. కంటి సంబంధ వ్యాధులకు, ఎముకలు బలంగా మారేందుకు గోంగూర చక్కగా ఉపయోగపడుతుంది. పప్పు, పచ్చడి, చికెన్.. ఇలా ఎందులో గోంగూర మిక్స్ చేసినా రుచి కూడా చాలా బాగుంటుంది.ఇక గోంగూర తీసుకోవడం వలన ఎలాంటి కిడ్నీ సమస్యలు కూడా వుండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: