ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా విలయ తాండవం చేస్తోంది. చిన్నా పెద్ద అని తేడా ఏమీ లేకుండా మొత్తం అందరికీ పాకుతోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతున్న కొద్దీ, ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపింది. మే 1 నుంచి 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అని తెలియజేసింది. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం అని ప్రధాన మంత్రి మోడీ చెప్పుకొచ్చారు. అందుకే అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని దాని కోసం కోవిన్ 2.0 లో రిజిస్టర్ చేయించుకోవాలి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో వ్యాక్సిన్ వేయించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే ఆ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్వాస: పని భారం లేకుండా దూరంగా ఉండండి. పని భారం ఎక్కువ అయితే అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందుకే కామ్ గా ప్రశాంతంగా ఉండండి .శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.

నిద్ర: వ్యాక్సిన్ వేయించుకునే ముందు కనీసం ఐదారు గంటల సేపు నిద్ర పోవాలి. పూర్తిగా అలసి పోయి నిద్ర లేకుండా ఉంటే మాత్రం వ్యాక్సిన్ చేయించుకోకూడదు. అలసట లేకుండా శరీరానికి మంచి విశ్రాంతి దొరికిన తరువాత వ్యాక్సిన్ వేయించుకోవాలి.

మద్యపానం: వ్యాక్సిన్ తీసుకునే ముందు రెండు రోజులు ముందు  మద్యం తీసుకోరాదు. అలా తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయదు.

పొగ : శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ కావాలంటే పొగ తాగకూడదు.

జింక్: యాంటీ బాడీ పనితీరు మెరుగు పరచడానికి జింకు చాలా సహాయపడుతుంది. మన శరీరంలో జింకు శాతం తగ్గితే ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ప్రోటీన్: మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ వుండే ఆహారాన్ని తీసుకోవాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కాబట్టి చూశారు కదా.. మీరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే ఈ పద్ధతులను తప్పకుండా పాటించాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: