అసలే ఇది వర్షా కాలం. వర్షాలు కూడా జోరుగా పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా అని పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలంటే కుదరని పని కదా. ఎదో ఒక అవసరం మీద బయటకి వెళ్ళినప్పుడు వర్షంలో తడవడం జరుగుతుంది.ముఖ్యంగా ఈ వర్షా కాలంలో తల, జుట్టు తడిసి పోతూనే ఉంటుంది.అందుకనే వర్షా కాలంలో జుట్టు మీద కాస్త శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.ఎందుకంటే గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది జుట్టు మీద ప్రభావితం చూపుతుంది. అందులోను వర్షాకాలంలో వర్షపు నీటిలో తడిసినట్లయితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ జుట్టు కూడా ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అసలు వర్షా కాలంలో మీ జుట్టుని ఎలా సంరక్షించుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.
చాలా మంది వర్షంలో తడిచి ఇంటికి వచ్చినప్పుడు తల స్నానం చేయకుండా టవల్ తో మాత్రమే జుట్టుని తుడుచుకుని ఆరబెట్టుకుంటారు. కానీ అది జుట్టుకు మంచిది కాదు.జట్టు ఆరిన తరువాత అయిన తలలో వాసన వస్తుంది. అందుకనే తరచుగా తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలాంటి సమయంలో, జుట్టు చాలా తొందరగా మురికిగా, జిడ్డుగా తయారవుతుంది కాబట్టి తల స్నానం చేయాలి.
తల స్నానం చేసాక మీ జుట్టుని పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోండి. అలాగే వర్షా కాలంలో రుతు పవనాల మార్పు వలన సాధారణంగా తలలో దురద పుట్టడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎప్పటికప్పుడు జుట్టుకి నూనె రాసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కాలంలో చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకనే తలస్నానం చేసే ముందు కలబంద గుజ్జును తలకు పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.వర్షంలో మీరు బయటకు వెళ్ళలిసిన పరిస్థితి వస్తే మీతో పాటు గొడుగు తీసుకుని వెళ్లడం మాత్రం మరిచిపోకండి !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి