గింజలు, నట్స్ వంటి ఆహార పదార్ధాలలో జింక్, బీటా-కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇతర ఆరోగ్య పోషక పదార్థాలు కూడా వీటి వల్ల మనకి బాగా లభిస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ని కూడా ఇవి క్రియేట్ చేస్తాయి.ఇంకా మన బాడీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి బాదం అనేది చాలా బాగా ఉపయోగ పడుతుంది. బాదం పప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇక బాదం పప్పు రోగనిరోధక శక్తిని నిజంగా చాలా దృఢంగా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది.ఇక అదే విధంగా పాలకూర కూడా రోగ నిరోధక శక్తికి చాలా మంచిది. ఇందులో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి. పాలకూర పప్పు ఇంకా పాలక్ పన్నీర్ అలాగే పాలక్ స్మూతీ మొదలైన వంటలని చేసుకొని తింటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పైగా వీటి రుచి కూడా చాలా బాగుంటుంది.

ఇక పాలకూరలో వుండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం, ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి కూడా తీసుకోవచ్చు.ఇక కమలా పండ్లు, బత్తాయి పండ్లు, జామ పండ్లలో కూడా అద్భుతమైన రోగ నిరోధక శక్తి గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.ఇవి అనేక వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి. కాబట్టి ప్రతి రోజు కూడా రెగ్యులర్‌గా వీటిని కూడా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు గుడ్లు కూడా రోగ నిరోధక శక్తికి చాలా మంచివి. కోడి గుడ్లలో కూడా మంచి రోగ నిరోధక శక్తిని మెరుగు పరిచే అనేక పోషక పదార్థాలు అనేవి ఉంటాయి. విటమిన్ డి ఉండే గుడ్లను నిత్యం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలను మీ డైట్‌లో తప్పనిసరిగా తీసుకోండి. దీంతో బాడీలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇలా మీరు ఈ ఆహార పదార్ధాలతో రోగ నిరోధక శక్తిని పెంచుకొని అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: