టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాగా విడుదలైన మొదటి షోనే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో నవీన్ పోలిశెట్టి ఓవర్సీస్ లో మరో అరుదైన రికార్డ్ అందుకున్నారు.


అనగనగా ఒక రాజు చిత్రంలో కామెడీతో పాటుగా చివరిలో బాగా ద్వేగమైన సన్నివేశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నవీన్ పోలిశెట్టి నటన ప్రశంసించారు. ముఖ్యంగా కామెడీతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నరు.మొదటి రోజు ఏకంగా రూ .22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా, మూడు రోజులలోనే రూ. 61 కోట్ల రూపాయలు కొల్లగొట్టి డిస్టిబూటర్లకు లాభాల పంట పండించింది. అనగనగా ఒక రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగానే కలెక్షన్స్ రాబడుతోంది.


ఓవర్సీస్ లో శనివారం ముగిసే సమయానికి 1 మిలియన్ డాలర్ల వసూలను రాబట్టింది. ఈ కలెక్షన్స్ తో నవీన్ పోలిశెట్టి వరుసగా జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు చిత్రాలతో వన్ మిలియన్స్ రాబట్టిన చిత్రాల లిస్టులో పేరు సంపాదించారు. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా వైరల్ గా చేస్తున్నారు. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో కూడా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నవీన్ పోలిశెట్టి. మీనాక్షి చౌదరి సంక్రాంతికి మరొకసారి అదరగొట్టేసి , సంక్రాంతికి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మరి రాబోయే రోజుల్లో అనగనగా ఒక రాజు సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: