శివ బాలాజీ, మధుమిత ప్రేమించి వివాహం చేసుకునే సమయంలో పెళ్లిలో చాలా అడ్డంకులు కూడా ఎదురయ్యాయని, ముఖ్యంగా మధుమిత తల్లికి ఈ వివాహం ఇష్టం లేదని, పెళ్లికి ఒప్పుకోకుండా మధుమితను ఒక గదిలో బంధించింది. శివ బాలాజీ కోసం మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేసింది మధుమిత. చివరికి ఆమె తండ్రి జోక్యం వల్ల తల్లిని ఒప్పించి వీరి వివాహం జరిపించారు. అలా వివాహమైన మొదటి ఒకటిన్నర సంవత్సరం వరకు వీరికి ఒక నరకంలా గడిచిందని తెలియజేశారు. అయితే అప్పటికే వీరికి బాబు పుట్టారని వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు, వీరి గొడవలలోకి మూడో వ్యక్తి రావడం వల్ల సమస్యలు మరింత ముదిరాయని తెలియజేశారు.
దీంతో ఆ గొడవలు తారా స్థాయికి చేరడంతో విడాకులు తీసుకోవాలనుకునే స్టేజ్ కి వెళ్లారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులపాటు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకొని అలా కొన్ని నెలలు ఉండడంతో వీరిద్దరి మధ్య ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టేశారు. అప్పటి సమస్యలను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయం ఈ జంట తీసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా బయట వ్యక్తుల ప్రమేయం లేకుండానే తమ సమస్యలను పూర్తిగా తామే పరీక్షించుకునే స్థాయికి చేరుకున్నామని అలా ఒకరి పైన ఒకరికి ఉన్న అపార్ధాలు తొలగించుకొని అన్యోన్యమైన దంపతులుగా ఇప్పటికీ కొనసాగుతున్నామని తెలిపారు. మధుమిత ,శివ బాలాజీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి