టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే అందరూ మృణాల్ పేరే చెబుతారు. ఆమె నటించిన సినిమాలు వరుసగా హిట్టవుతుండటంతో, ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది.ప్రస్తుతం ఆమె ప్రభాస్, రజనీకాంత్ వంటి స్టార్ల సినిమాల్లో నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఆమె పెళ్లి చేసుకోబోతోందని రూమర్లు సృష్టించడం వల్ల, నిర్మాతలు ఆమెను సంప్రదించడానికి వెనుకాడతారనేది ఆ నెగెటివ్ పిఆర్ టీమ్ ప్లాన్ అనిపిస్తోంది.తనపై వస్తున్న ఈ అసత్య ప్రచారాలపై మృణాల్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. గతంలోనే ఆమె "నా పెళ్లి వార్తల్లో నిజం లేదు.. నేను ప్రస్తుతం నా కెరీర్‌తోనే ప్రేమలో ఉన్నాను" అని కుండబద్దలు కొట్టింది. అయినప్పటికీ ఆగని ఈ రూమర్ల వెనుక ఉన్న సోర్స్ ఎంటనేది ఆమె టీమ్ ఇప్పుడు ఆరా తీస్తోంది. కావాలనే ఒక పద్ధతి ప్రకారం ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు కేవలం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ నెగెటివ్ పిఆర్ సంస్కృతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఒక హీరోయిన్ ఎదుగుతుంటే, ఆమెను తొక్కేయడానికి ప్రత్యర్థి టీమ్స్ ఇలాంటి ఫేక్ రూమర్లను స్ప్రెడ్ చేస్తుంటాయి. మృణాల్ విషయంలో కూడా ఇదే జరుగుతోందని, ఆమెకు వస్తున్న పాన్-ఇండియా క్రేజ్‌ను చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి మృణాల్ ఠాకూర్ ఈ నెగెటివ్ సునామీని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. రూమర్లు ఎన్ని వచ్చినా, తన టాలెంట్‌తో వాటిని తుడిచిపెట్టేయడం మృణాల్‌కు కొత్తేమీ కాదు. "సీతమ్మ" ధైర్యంగా నిలబడి, తన సినిమాలతోనే సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి