సాధారణంగా కాలానికి అనుగుణంగా శరీరంలో కూడా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా తరచూ వచ్చే ఫ్లూ సమస్యలను మొదలుకొని.. జీర్ణ సమస్యల వరకూ ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా చాలామంది ఫ్లూ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి సమస్యల నుంచి ఈ వర్షాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..


పచ్చ మిరియాలు:
వీటిలో ఆల్కలాయిడ్ తో పాటు విటమిన్ కె అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. పచ్చ మిరియాల లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల ఫ్రీరాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ వంటి కణాలను కూడా దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ కారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారా  ఏదైనా చెడు బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు దానిని నిర్మూలిస్తాయి. ఇక అంతే కాదు మిరియాలు తినడం వల్ల మన శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కడుపులో మంట, గ్యాస్, అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.


తాజా పండ్లు:
ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే చెర్రీస్ ,జామున్, దానిమ్మ , రేగు వంటి పండ్లను తినడం వల్ల వీటిలో విటమిన్ ఎ ,విటమిన్ సి, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కూరగాయలు:
ముఖ్యంగా ఈ కాలం పొట్లకాయ కు ప్రసిద్ధి.. ఈ పొట్లకాయతో సూప్ లేదా సలాడ్, రైటా, కూర లాగా చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే, బ్యాక్టీరియా అలాగే వైరస్ లను దూరం చేసుకోవచ్చు.


ప్రోటీన్లు:
మనం అత్యధికంగా రోజువారి ప్రోటీన్ ను శరీరానికి అందించడం వల్ల, మన శరీరంలో ప్రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఎక్కువగా పాలు అలాగే పాల ఉత్పత్తులు రాజ్మా, గుడ్డు, చికెన్, పప్పుధాన్యాలు వంటివి పుష్కలంగా తినడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు లభిస్తాయి.

ప్రోబయోటిక్స్:
ఎక్కువగా మజ్జిగ, పెరుగు ,కూరగాయలు, కాయగూరలు వంటి వాటిలో ఈ ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడే చెడు బ్యాక్టీరియాను ఈ ప్రోబయోటిక్స్ బయటకు వస్తాయి.

ఇక వీటితో పాటు అల్లం, వెల్లుల్లి ,మెంతి గింజలు, పసుపు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మనం ఈ వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: