దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చాలా వేగంగా సాగుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి టీకాలు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా రోజు రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. అవేంటో చూద్దామా..?  దేశం మొత్తం వ్యాక్సిన్ పక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి టీకాలు కూడా ఇస్తున్నారు. ఈ ప్రక్రియలోనే  తాజాగా ఆరోగ్య కేంద్రంలో  అధికారి తప్పిదంతో ఒక అరగంట సమయంలోనే  ఒక వృద్ధురాలికి  రెండు డోసులు వ్యాక్సిన్లు వేశారు. 84 సంవత్సరాల ఆ ముసలావిడ కు అర్ధ గంట సమయంలో కోవిషిల్డ్ వ్యాక్సిన్  రెండు డోసులు ఇవ్వడం కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఎర్నాకులం జిల్లా కేంద్రంలోని హల్వా ప్రభుత్వ దవాఖానాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 84 సంవత్సరాల తుందమ్మ అనే  వృద్ధురాలు  తన కొడుకుతో కలిసి  వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకోవడానికి వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకుంది. దవాఖాన నుంచి వెళ్ళిపోయింది.

అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమె చెప్పులు మర్చిపోయి మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. అయితే అప్పుడే వ్యక్తిని అందించే అధికారి  మరోసారి ఆమెను లోపలికి పిలిచాడు. మరొక డోస్ వ్యాక్సిన్ కూడా వేశాడు. ఆ తల్లి అరగంట ముందే నేను వేసుకున్నను అని, మళ్లీ చెప్పుల కొరకు వచ్చానని, ఆమె చెప్పినా వినిపించుకోకుండా రెండవ డోస్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ వృద్ధురాలు భయంతో  ఆందోళన చెందింది. పెద్ద తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి  వైద్య సిబ్బంది, ఆమెను ఒక అరగంట సమయం  ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ సమయంలో ఆమె లో  ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ రాకపోవడంతో  అంత ఊపిరి పీల్చుకొని ఆ వృద్ధురాలిని  ఇంటికి పంపారు. ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన  అరగంట సమయం లో ఆ ముసలావిడ కు రెండు డోసులు వ్యాక్సినేషన్ ఈ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: