ఇక చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో చెవిని శుభ్రపరిచేందుకు ఇంకా చెవిలో గులిమిని తీసుకోడానికి చాలామంది ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తుంటారు.ఇక మరికొందరు అయితే తమ చిటికెన వేలును చెవి లోపలికి దూర్చి గులిమిని తీయాలని తెగ ప్రయత్నిస్తారు. కాని అసలు ఇలా చేయడం సరైన పద్దతేనా.? దీని గురించి డాక్టర్లు ఏమంటున్నారు.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.ఇక మన చెవులను శుభ్రపరిచేందుకు లేదా చెవిలో గులిమి తీసేందుకు చిటికెన వేలు కాని లేక కాటన్ బడ్స్ ఉపయోగించడం అనేది అసలు మంచి పద్దతి కాదని వైద్య నిపుణులు అంటున్నారు. అలా చెయ్యడం వలన అనేక సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు. ఇక సాధారణంగా చెవిలో గులిమిని తీసుకునేందుకు మనం కాటన్ బడ్స్ ని చాలా ఎక్కువ శాతం ఉపయోగిస్తాం. అయితే వాటిని చెవిలో ఉపయోగించడం వల్ల చెవుల్లో గులిమి అనేది ఇంకా లోపలికి వెళ్తుంది.ఇక కాటన్ బడ్స్ వాడటం వల్ల మీకు చెవుల్లో దురద తగ్గి హాయిగా ఉండి వాటి నుంచి కాస్త ఉపశమనం పొందినా కాని గులిమి అనేది పోయి చెవి శుభ్రపడదు.

ఇక అలాగే కొన్నిసార్లు కాటన్ బడ్స్ అనేవి వాడటం వల్ల చెవి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా కూడా గులిమిపైకి చేరి మీ చెవులకు పెద్ద హనిని కలిగించే ప్రమాదం అనేది మీకు ఉంటుంది. అలాగే కాటన్ బడ్స్ ద్వారా మీ చెవిలో గులిమిని తీసుకునేటప్పుడు చెవిపైన మీ చర్మం అనేది బాగా మండుతుంది. అందువల్ల బాగా దురద పుడుతుంది. ఇక అక్కడ మనం మళ్లీ గోక్కోవడం లాంటి పనులనేవి కనుక చేస్తే తిరిగి బ్యాక్టీరియా ఆ ప్రాంతంలో సులభంగా చేరుతుంది. మీకు మళ్లీ చెవిలో నొప్పి అనేది చాలా మొదలవుతుంది. ఇక అలాగే కాటన్ బడ్స్‌ను గట్టిగా చెవిలో దూర్చడం వల్ల మీ కర్ణభేరి అనేది దెబ్బ తినే అవకాశం కూడా ఉంది.ఇక ఒకవేళ కర్ణభేరి కనుక దెబ్బ తింటే మీకు బాగా నొప్పి అనేది రావడం, లేదా చెవులు సరిగ్గా వినిపించకపోవడం వంటి సమస్యలు అనేవి బాగా ఎదురవుతాయి.ఇక అందుకే కాటన్ బడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని డాక్టర్స్ నిరూపించి మరి చెబుతున్నారు.ఇక అలాగే స్నానం చేస్తున్న సమయంలో మీరు మీ చెవులను కనుక శుభ్రపరుచుకుంటే ఇన్ఫెక్షన్ మొదలైన వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: