గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో పల్లేరు మొక్క చాలా బాగా పని చేస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు అర లీటర్ నీటిలో రెండు టీస్పూన్ల పల్లేరు సమూల చూర్ణాన్ని వేసి 2 కప్పుల కషాయం మిగిలే దాకా మరిగించాలి. ఇలా మరిగించగా వచ్చిన కషాయంలో కండ చక్కెరను కలిపి రెండు పూటలు కూడా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గుతాయి. నోటి దుర్వాసన ఇంకా చిగుళ్ల నుండి రక్తం కారడం, నోటి పూత, నోట్లో పుండ్లను తగ్గించడంలోనూ ఈ మొక్క తోడ్పడుతుంది. పల్లేరు సంపూర్ణ చూర్ణాన్ని 20 గ్రా. ల చొప్పున తీసుకుని పావు లీటర్ నీటిలో వేసి సగం అయ్యే దాకా మరిగించాలి. ఇలా మరిగించిన నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇలా మరిగించిన నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, ఆయాసం ఇంకా దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.మగ వారిలో వచ్చే సంతాన సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 గ్రా. పల్లేరు కాయల పొడిని ఇంకా 5 గ్రా. ల కండ చక్కెర పొడిని తీసుకుని కలిపి రెండు పూటలా చప్పరించి ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల శీఘ్రస్కలనం, స్వప్న స్కలనం ఇంకా మూత్రంలో వీర్యం పోవడం వంటి సమస్యలు తగ్గి వీర్య కణాల సంఖ్య అమితంగా పెరుగుతుంది. 


ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి బాగా దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి రెట్టింపు కండ చక్కెరను కూడా కలిపి తీగ పాకం వచ్చే దాకా మరిగించి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుని 2 కప్పుల నీటిలో కలిపి రెండు పూటలా తాగడం వల్ల కామెర్లు ఇంకా అలాగే కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాలేయం కూడా చాలా బలంగా తయారవుతుంది.పల్లేరు మొక్క ఆకుల రసాన్ని అర కప్పు చొప్పున రెండు పూటలా తాగడం వల్ల మూత్రాశయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మూత్ర పిండాలలో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది.ఇంకా స్త్రీలల్లో బహిష్టు ఆగకుండా అవుతూనే ఉంటే పల్లేరు కాయల పొడిని ఒక స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలిపి ఒక కప్పు అయ్యే దాకా మరగించి రెండు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలలో బహిష్టు ఆగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: