చాలా మంది గ్యాస్ ట్రబుల్ కి గుండెపోటుకు తేడా తెలియక చాలా బాధపడుతుంటారు. ఈ రెండింటి లక్షణాలు దగ్గర దగ్గరగా ఉండటంతో అసలు ఏ నొప్పి దేని వలన వస్తుంది అన్నది తెలియక తెగ టెన్షన్ పడుతుంటారు. అయితే ఈ తేడా తెలియక కొందరు మరింత ప్రమాదంలో పడుతుంటారు. గ్యాస్ ట్రబుల్ అయితే పర్వాలేదు. కానీ గుండె పోటు వచ్చినపుడు గుర్తించకుండా ఇది గ్యాస్ ట్రబులే తగ్గుతుందని భరిస్తూ కూర్చుంటే ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ రెండింటి మధ్య తేడా గుర్తించి వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.

ఛాతీ మంట, గుండెపోటు అనేవి రెండూ వేర్వేరు అనారోగ్య సమస్యలు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం వలన ఛాతీలో మంట వస్తుంది. ఇది సాధారణమైన గ్యాస్ సమస్య.

మరొకటి ఏమిటంటే గుండె రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వలన, లేదా రక్తం సరఫరా ఆగిపోవటం లేదా సరఫరాలో హెచ్చు తగ్గులు జరగడం వలన గుండెపోటు వస్తుంది. ఇది అత్యవసర సమస్య వెంటనే డాక్టర్ని సంప్రదించపోతే చాలా ప్రమాదం. కాగ వీరి మధ్య తేడాను ఇలా గుర్తించండి.

గుండెపోటు లక్షణాలు

* గుండెపోటు అయితే గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా ఫీల్ అవగలం.
* చెమటలు ఎక్కువగా పడుతాయి.
* నొప్పి ఛాతీలో మొదలయ్యి భుజాలు, చేతులు, మెడ వైపుకు పాకుతుంది. నొప్పి తీవ్రంగా భరించలేని విధంగా ఉంటుంది.
* శ్వాస అస్సలు ఆడదు, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.
* ఛాతీలో మధ్యలో నొప్పి వస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. వస్తు తగ్గుతూ ఉంటుంది. లేదా కొందరికి ఆగకుండా వస్తుంది.
* కొన్ని సార్లు వాంతులు కూడా అవుతాయి.

ఛాతీ మంట ...

* ఛాతీ పక్కన నొప్పి , ఎముకల్ని పిండేస్తున్నట్లు వస్తుంది.
 
* పుల్ల తేపులు, గొంతులో వికారం.

* గొంతులో నొప్పి వస్తుంది.. కానీ భుజాలకు, చేతులకు పాకదు.

*ఎక్కువగా మసాలా పదార్థాలను తిన్న తరవాత ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి.  

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.. కానీ కాస్త నడిస్తే తేపులు వచ్చి కాస్త ఫ్రీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: