ఇక అసలే వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వస్తాయి అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక అలాంటి వాటిలో దగ్గు , జలుబు తో పాటు జ్వరం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటే నుదుట పై చల్లటి తడిగుడ్డ వేయడం వల్ల జ్వరం తగ్గుతుంది అని అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉష్ణోగ్రత అనేది గుండె, తల పై ప్రభావం చూపకుండా.. ఇలా చల్లని నీటిలో అద్దిన టవల్ ను నుదిట పైన వేస్తారు. ఇలా చేయడం వల్ల కళ్ళ తో పాటు గుండె కూడా సురక్షితంగా ఉంటుంది. వాతావరణంలో మార్పు కారణంగా చాలామందికి తరచూ జ్వరం వస్తుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత 98.6 ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటే దానిని మీరు సాధారణ జ్వరం గా పరిగణించవచ్చు.

ఇక జ్వరం లక్షణాలు తలనొప్పి, శరీర నొప్పులు, తల తిరగడం, అలసట ,ఆకలి లేకపోవడం, కండరాల తిమ్మిరి, శారీరకంగా శక్తి లేకపోవడం లాంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 3 నుండి 7 రోజుల వరకూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వల్ల మనిషి శారీరక వ్యక్తిని కూడా కోల్పోతాడు. ఇక మెడిసిన్ తీసుకున్న సరే శరీర ఉష్ణోగ్రత తగ్గదు. ఒకవేళ మీకు ఇలా జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇక జ్వరం అధికంగా ఉన్నప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల జ్వరానికి మంచి చికిత్స అని చెప్పవచ్చు . ఇడ్లీ , దోస వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

అధిక జ్వరం వచ్చినప్పుడు రోగి యొక్క నాభి,  అరికాళ్ళ పైన గంధాన్ని పూయడం వల్ల జ్వరం నెమ్మదిగా తగ్గుతుంది. దానిమ్మ రసాన్ని తాగాలి.ఇలా చేస్తే జ్వరం వచ్చినప్పుడు త్వరగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: