ముద్దు అన్నది శృంగారంలో తొలి మెట్టు అని చెప్పాలి. ఏ ఇద్దరి ఆడ మగ మధ్యన రిలేషన్ ఉన్నా ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తుందా అని పరస్పరం ఎదురుచూస్తూ ఉంటారు. ముద్దు ద్వారా ఒకరికి ఒకరు తమ ప్రేమను అవతలి వారికి వ్యక్తపరచవచ్చు. ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చన్న విషయం ఇదివరకే చాలా సార్లు నిరూపితం అయింది. అలాంటి ప్రేమ మరింతగా బలపడాలంటే ముద్దు చాలా కీలకం గా మారుతుంది. ఇక ఈ ముద్దు పూర్వకాలంలో అయితే బుగ్గల మీదన, నుదితు మీదన పెట్టేవారు.. కానీ నేటికాలంలో అయితే డైరెక్ట్ గా పెదాలమీదనే ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఇందులో కూడా చాలా రకాల ముద్దులు ఉన్నాయట.. ఫ్రెంచ్ కిస్, స్పైడర్ మాన్ కిస్ అంటూ చాలానే ఉన్నాయి.

ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ముద్దులు పెట్టుకోవడం పైన ఒక సర్వే నిర్వహించారట. మాములుగా మనకు తెలిసిన వరకు ముద్దు పెట్టుకుంటే మన శరీరంలోని కేలరీలు ఖర్చు అవడంతో పాటుగా ఇద్దరి మధ్యన ప్రేమ మరింత పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు సర్వే లో వెల్లడైన ఓ నిజాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా భయపడతారు. మనకు ఎంతో హాయిని ఆనందాన్ని ఇచ్చే ముద్దు ఇబ్బందులను కూడా కొనితెస్తుందట. ముద్దు పెట్టుకోవడం వలన మన ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ముద్దు వలన సంక్రమించే ఏ వ్యాధిని అయినా లైంగిక పరమైన వ్యాధులు అంటారు.

ముద్దు వలన హెర్పెస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఇద్దరిలో ఎవరికైనా సోకే అవకాశం ఉందట. అయితే అలా జరగకుండా ఉండాలంటే నోటి దగ్గర లేదా పెదాల వద్ద గాయం ఉన్నప్పుడు ముద్దుకు దూరంగా ఉండడం మంచిదని వీరు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న విధంగా ముద్దులు పెట్టుకోవడం వలన లైంగిక వ్యాధులు ఎక్కువగా సంక్రమించవు. కానీ యోని ద్వారా మరియు రక్తం ద్వారా అయితే ఎక్కువగా లైంగిక వ్యాధులు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: