కంటి చూపు మెరుగుపడాలంటే..?

కంటి చూపు సరిగ్గా లేనివారు లేదా తక్కువగా ఉన్న వారు ముందుగా ఒక 4 లేదా 5 మిరియాలను తీసుకుని వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇందులో అర టీ స్పూన్ లేదా ముప్పావు టీ స్పూన్  పటిక బెల్లం పొడిని ఇంకా అలాగే ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. అలాగే దీనిని తీసుకున్న ఒక గంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలను ఇంకా నీటిని తీసుకోకూడదు.ఇక దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకున్న వారం రోజుల్లోనే మన కంటి చూపులో వచ్చే తేడాను ఖచ్చితంగా మనం గమనించవచ్చు. 


వారం రోజుల్లో తేడా కనిపించినప్పటికి మూడు నెలల పాటు ఈ టిప్ ని క్రమం తప్పకుండా పాటించాలి. ఈ విధంగా ఈ టిప్ క్రమం తప్పకుండా పాటించడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ తిప్ తో పాటు కంటి చూపు తక్కువగా ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మన కంటి చూపు చక్కగా ఉండాలంటే మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడం కూడా చాలా అవసరం.క్యారెట్, గుడ్లు, చిలగడ దుంపలు, చేపలు, పాల పదార్థాలు ఇంకా అలాగే బాదం పప్పు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి ఖచ్చితంగా మన కంటి ఆరోగ్యానికి మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి కంటి చూపు మెరుగుపడాలంటే..ఖచ్చితంగా ఈ తిప్ పాటిస్తూనే ఈ ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తినండి. కంటి చూపుని మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: