
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి అవసరమయ్యే ఆయిల్స్ రక్తం లోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొత్తిమీరను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. దీనిని ఆహారంలో తీసుకోవడం వలన శరీరంలో హాని చేసే కొవ్వును తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.శరీరంలో ఏర్పడ గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.
ఇది ధమనులు మరియు సిరాల గోడల పై ఏర్పడే కొవ్వును కరిగిస్తుంది.అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పులను అరికడుతుంది. గుండె జబ్బులను రాకుండా కాపాడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక రక్తపోటును వారిస్తుంది.కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను తొలిదశలో చంపే శక్తి కూడా దీనికి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దీన్నీ తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే వికారం మరియు వాంతి అయ్యేలా ఉండే సమస్యలు సమిసి పోతాయి. అంతేకాకుండా కడుపులో ఏర్పడే సమస్యలను నివారిస్తుంది. కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.నోటిలో ఏర్పడే పూతలను పుండ్లను నివారిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. నోటిలో హాని కరకాలైన క్రిములను నాశనం చేస్తుంది.చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది.నోటిలో ఏర్పడే అల్సర్లను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది. దీనిని తరచు గా తీసుకోవడం వలన కంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఒత్తిళ్ళను మరియు మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది.