పసుపు రంగులో ఉన్న ఈ పళ్ళని తెల్లగా మార్చుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎలాంటి శ్రమ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. దంతాలను తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం అరటి పండు తొక్కను, చిటికెడు పసుపును, చిటికెడు ఉప్పును ఇంకా తెల్లగా ఉంటే ఒక టీ స్పూన్ టూత్ పేస్ట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అరటి పండుతొక్క లోపల ఉండే తెల్లటి పదార్థాన్ని ఒక టీ స్పూన్ సహాయంతో ఒక గిన్నెలోకి తీసుకోని దీనిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకున్న తరువాత ఇందులో ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలపాలి. ఆ తరువాత టూత్ పేస్ట్ ను వేసి కలపాలి.


ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో తీసుకుని పళ్ళని బాగా శుభ్రం చేసుకోవాలి.మాములుగా రోజు మనం ఎలా అయితే పళ్ళని శుభ్రం చేసుకుంటామో ఈ మిశ్రమంతో కూడా దంతాలను అదే విధంగా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల పసుపు రంగులో ఉండే దంతాలు చాలా ఈజీగా తెల్లగా మారతాయి. ఇంకా అంతేకాకుండా దంతాలు ఇంకా చిగుళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని వాడుతూనే భోజనం చేసిన తరువాత పళ్ళని చక్కగా శుభ్రం చేసుకోవాలి. టీ ఇంకా కాఫీలను తక్కువగా తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా పొగాకు ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా దంతాలను తెల్లగా ఇంకా అలాగే ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. పసుపు రంగులో వుండే పళ్ళని తెల్లగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: