మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే మసాలా దినుసులు  జీలకర్ర, ధనియాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే. వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్ర అలాగే ధనియాలను ఉపయోగించడం వల్ల వంటల రుచి బాగా పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. జీలకర్రలో చాలా పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.మీరు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను ఇంకా ఒక టీ స్పూన్ ధనియాలను వేసి మరిగించాలి.తరువాత ఇందులోనే రెండు చిటికెల మిరియాల పొడిని కూడా మీరు వేసుకోవాలి. ఈ నీటిని సగం అయ్యే దాకా మరిగించి గోరు వెచ్చగా అయ్యే వరకు అలాగే ఉంచాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.


అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ఇంకా మలబద్దకం వంటి సమస్యలన్నీ ఈజీగా తగ్గుతాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. మన ఎముకలు ధృడంగా మారతాయి. నోటి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇంకా మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ధనియాలు మనకు చాలా విధాలుగా సహాయపడతాయి. ఈ విధంగా ఈ కషాయాన్ని తాగడం వల్ల మనం ఖచ్చితంగా చాలా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: