నోటి ఆరోగ్యం కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా బ్రష్ చేయడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇలా రెగ్యులర్ గా బ్రష్ చేయకపోతే నోటిలో దుర్వాసన మాత్రమే కాదు ఇక ఎన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో కొంతమంది కేవలం ఉదయం సమయంలో మాత్రమే ఇక పళ్ళు తోముకోవడం చేస్తూ ఉంటే ఇంకొంతమంది ఉదయం సాయంత్రం సమయంలోను ఇలా బ్రష్ చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా నోటిశుభ్రత విషయంలో మాత్రం కొంతమంది అత్యుత్సాహంతో ఇక పొరపాట్లు చేస్తూ ఉంటారు అని నిపుణులు చెబుతూ ఉంటారు. ఎంతోమంది బ్రష్ చేసుకునే సమయంలో బ్రష్ ని ట్యాప్ కింద కడిగిన తర్వాత ఇక దానిపై పేస్ట్ పెట్టుకుని పళ్ళు తోముకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇది అతి పెద్ద పొరపాటు అంటూ దంత వైద్యులు చెబుతున్నారు. బ్రష్ ను ముందుగా తడి చేయడం వల్ల టూత్ పేస్ట్ డైల్యూట్ అయిపోతుందట. అయితే టూత్ పేస్టులో దంతాలకు కావాల్సినంత తేమ ముందుగానే ఉంటుందని చెబుతున్నారు దంత వైద్యులు. బ్రష్ మరింత తడిగా ఉంటే త్వరగా నురగ పైకి తేలుతుందని అందుకే ఇక త్వరగానే పేస్ట్ ఉమ్మి వేయాల్సి వస్తుందని చెబుతున్నారు.


 తద్వారా ఇక టూత్ పేస్ట్ లో ఉన్న సుగుణాలు అన్ని దంతాలకు సరిగా అందవట. అదే సమయంలో ఇక దంతాలను శుభ్రం చేసేందుకు మన తేలిన బ్రెసిల్స్ వాడటం అంత మంచిది కాదు అంటూ చెబుతున్నారు దంత వైద్యులు. బ్రిసిల్స్ ఎప్పుడు మృదువుగా నిటారుగా ఉండాలని.. దంతాల మధ్య శుభ్రం చేసేందుకు ఉపయోగించే బ్రిసిల్స్ అన్ని మూలల్లో శుభ్రం చేసే విధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఎంతసేపు బ్రష్ చేస్తున్నారు అనే దానికంటే ఎంత శుభ్రంగా బ్రష్ చేస్తున్నారు అనేది ముఖ్యమంటున్నారు.అంతేకాకుడా పళ్ళు తోముకున్న తర్వాత బ్రష్ శుభ్రమైన ప్రాంతాలలో పెట్టడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: