హైపో థైరాయిడిజం సమస్య అదుపులో ఉండాలంటే ఖచ్చితంగా మందులతో పాటు మనం ఇప్పుడు చెప్పే ఆహారాలను కూడా తీసుకోవాలి.ఎందుకంటే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా అలాగే సమస్య కూడా మరింత తీవ్రతరం కాకుండా అదుపులో ఉంటుంది.హైపో థైరాయిడిజంతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైపో థైరాయిడిజం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతుంది. ఇది ఖచ్చితంగా గుండె జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెండచంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కూడా ఈజీగా తగ్గిస్తాయి.ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలల్లో ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మన శరీరానికి తగినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. అయితే ఈ చేపలను వీలైనంత వరకు ఉడికి తీసుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. వాటిని నూనెలో వేయించి తీసుకోకూడదు. ఇంకా అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో బ్రెజిల్ నట్స్, మకాడమియా నట్స్, హజెల్ నట్స్ వంటివి ఎంతగానో సహాయపడతాయి. ఈ నట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఎందుకంటే వీటిలో సెలెనియం ఎక్కువగా ఉంటుంది.


ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంతో పాటు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇక హైపో థైరాయిడిజంతో బాధపడే వారిలో కనిపించే మరో సమస్య వచ్చేసి మలబద్దకం.ఈ సమస్య నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలను తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను పెంచి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక హైపో థైరాయిడిజంతో బాధపడే వారు కొవ్వు తక్కువగా ఉండే పెరుగును ఖచ్చితంగా తీసుకోవాలి. పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో అయోడిన్ అనేది ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పెరుగుదలను నివారించడంలో బాగా సహాయపడుతుంది. కాబట్టి రోజూ ఒక కప్పు కొవ్వు తక్కువగా ఉండే పెరుగును తీసుకోవాలి. ఇలా పెరుగును ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల థైరాయడ్ గ్రంథి చక్కగా పని చేయడానికి అవసరమయ్యే అయోడిన్ అనేది లభిస్తుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య నుండి ఇంకా అలాగే దాని వల్ల ఎదురయ్యే ఇతర సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: