ఈ రోజుల్లో కండరాల నొప్పులు  అందరికీ సర్వసాధారణమయ్యాయి. ఒక సర్వే ప్రకారం జనాభాలో సుమారు 65 శాతం మంది తరచూ ఒళ్లు నొప్పులు ఇంకా కండరాల నొప్పులతో బాధ పడుతున్నారు అని తెలిసింది.అయితే ఏ పని కూడా చేయకుండా నిశ్చలంగా ఒకే చోట కూర్చోవడం లేదా శారీరక శ్రమ ఎక్కువైనపుడు, తీవ్రమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు కండరాల నొప్పులు వస్థాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇంకా చలికాలం కారణంగా కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతున్నాయి. అయితే కండరాల నొప్పి ఉన్నప్పుడు వెంటనే మెడిసిన్స్ వాడటం ఇంకా చికిత్స కోసం పరుగులు తీయడం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఇంటివద్దనే కొన్ని సాధారణ నివారణలని ప్రయత్నించాలి.గోరు వెచ్చని పాలను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కండరాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి.ఇంటి చిట్కాలతోనే దాదాపు కండరాల నొప్పి నుంచి మనకు రిలీఫ్ లభిస్తుంది. ఇక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలి.


అయితే ఈ కండరాల నొప్పులు అనేవి సహజంగానే చాలా మందికి కూడా వస్తుంటాయి. శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగలడం లేదా కండరాలు పట్టుకుపోవడం వల్ల కూడా కండరాల నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఈ విధంగా కండరాల నొప్పి కనుక ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అసలు ఏ పనీ చేయలేరు. కానీ కొన్ని ఆయుర్వేద చిట్కాలను కనుక పాటిస్తే కండరాల నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ లభిస్తుంది.నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని దానిని వేడి చేయాలి. దాంతో మనకు నొప్పి ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి. రోజుకు రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తుంటే కండరాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. అలాగే తులసి కూడా ఒక ఆయుర్వేద ఔషధం అని మనకు తెలిసిందే. తులసిలో నొప్పిని తగ్గించే గుణాలు చాలానే ఉన్నాయి. ఇది కండరాలకు మసాజ్ చేసి మంచి రిలీఫ్ ని కలిగిస్తుంది. అందుకే రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే నొప్పి నుంచి చాలా త్వరగా రిలీఫ్ లభిస్తుంది. అలాగే తులసి ఆకులు నమలడం ద్వారా కూడా ప్రయోజనాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: