ఆయుర్వేదంలో చాలా అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా దీనిని వాడుతూ ఉంటారు. తిప్పతీగ జ్యూస్, పౌడర్ రూపంలో మనకు బయట కూడా లభిస్తూ ఉంటుంది. చాలా మంది కూడా దీనిని ఔషధంగా తీసుకుంటూ ఉన్నారు. అయితే కేవలం తిప్పతీగ జ్యూస్ ను తీసుకోవడానికి బదులుగా తిప్పతీగ ఇంకా పసుపును కలిపి తీసుకోవడం వల్ల మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తిప్ప తీగ, పసుపు రెండూ కూడా ఎన్నో ఔషధ గుణాలను ఇంకా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. తిప్ప తీగ ఇంకా పసుపు నీటిని తయారు చేసుకోవడం చాలా సులభం.


ఇందుకోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక ఇందులో మిరియాల పొడి, పసుపు, దాల్చిన చెక్క, అల్లం తురుము, తిప్ప తీగ పొడి ఇంకా పుదీనా ఆకులు వేసి వేడి చేయాలి. ఈ నీటిని మరో నిమిషం పాటు అలాగే మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న నీటిని వడకట్టి తీసుకోవాలి. ఈ నీటిని ఒక కప్పు మోతాదులో వారానికి 3 సార్లు తాగడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా తిప్పతీగ, పసుపు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇన్పెక్షన్ లు, జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి.


మనం ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది.జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. పొట్ట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ నీటిని తాగడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా తిప్పతీగ, పసుపు నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు ఈజీగా దూరమవుతాయి. ఈ విధంగా తిప్పతీగ ఇంకా పసుపు నీటిని తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీటిని తాగే ముందు ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: