మనలో చాలామంది జెర్రీని చూసి భయపడుతూ ఉంటారు. మరికొందరు తమ పంట పొలాలకు జెర్రీ వల్ల నష్టాలు వచ్చాయని చెబుతూ ఉంటారు. అయితే జెర్రీ కనిపిస్తే అది లాభమా? నష్టమా? అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి.

వాస్తు శాస్త్ర ప్రకారం, జెర్రీని లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందుకే జెర్రీ ఇంట్లో కనిపించడం శుభప్రదం అని పండితులు చెబుతుంటారు. జెర్రీ ఇంట్లో కనిపిస్తే ఇంట్లో ఐశ్వర్యం వస్తుందని, అదృష్టం వరిస్తుందని చెబుతారు. ఆర్థికపరంగా జెర్రీ చాలా కలిసి వస్తుందని, ఇంట్లో జెర్రీ కనిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరమై, డబ్బు వస్తుందని చెబుతారు. ఇంటి గోడలకు రంధ్రాలు చేస్తూ కనిపించే జెర్రీల వల్ల ఏమైనా నష్టాలు వస్తాయేమో అని చాలామంది భయపడుతుంటారు. అయితే జెర్రీలు చేసే రంధ్రాల వల్ల ఇంటి గోడలు కూలిపోవడం, నష్టాలు రావడం వంటివి జరగవని పండితులు చెబుతున్నారు.

అయితే జ్యోతిష్య శాస్త్రంలో జెర్రీ కనిపించడం శుభప్రదం అని చెప్పినా కూడా, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. జెర్రీలు తినే ఆహారం మిగిలిపోయిన ఆహారం కనుక తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జెర్రీలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులు నాశనం అవుతాయని, జెర్రీలు ఇంట్లో ఉంటే వస్తువులు పగిలిపోవడమే కాకుండా, బట్టలను కూడా నాశనం చేస్తాయని చెబుతారు. అలాగే జెర్రీలు తిరిగిన ఆహారాన్ని మనం తింటే ఫుడ్ పాయిజనింగ్ కూడా జరిగే అవకాశం ఉంది.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో జెర్రీ కనిపించడం మంచిదే అయినా, జెర్రీ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఇంటికి వచ్చే నష్టాలు గమనించి జెర్రీని దూరంగా పెట్టడానికి జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: