అధిక రక్తపోటు (High Blood Pressure) లేదా హైపర్‌టెన్షన్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్న ఒక సాధారణ సమస్య. దీనిని "సైలెంట్ కిల్లర్" అని కూడా అంటారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో సోడియం (ఉప్పు) వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అందుకే, హై బీపీతో బాధపడేవారు వంటల్లో ఉప్పుకు బదులుగా రుచిని పెంచే, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను వాడుకోవడం మంచిది. నిమ్మరసం ఉప్పుకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. వంటకాల్లో, సలాడ్లలో లేదా సూప్‌లలో చివరగా కొద్దిగా నిమ్మరసం కలిపితే మంచి రుచి, పులుపు వస్తుంది. ఇది ఆహారానికి సోడియంను జోడించకుండానే రుచిని పెంచుతుంది. వెల్లుల్లి, అల్లం వంటి వాటిని వంటల్లో వాడడం వల్ల రుచి, సువాసన పెరుగుతాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి లేదా వెల్లుల్లి పొడిని ఉపయోగించవచ్చు.

ఉప్పు  లేకుండా వంటకాలు రుచిగా ఉండాలంటే, అనేక రకాల మసాలా దినుసులు మరియు ఆకులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మిరియాల పొడి,  వాము, జీలకర్ర ధనియాల పొడి, దాల్చిన చెక్క, పుదీనా,  కొత్తిమీర, తులసి ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో పొటాషియం క్లోరైడ్ ఉపయోగించి తయారు చేసిన తక్కువ సోడియం ఉప్పు మిశ్రమాలు లభిస్తాయి. ఇవి సాధారణ ఉప్పు రుచిని పోలి ఉంటాయి, కానీ సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అయితే, వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం, ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి.

కొద్దిగా ఫ్లేవర్డ్ వెనిగర్ (యాపిల్ సైడర్ వెనిగర్ వంటివి) ను సలాడ్లు లేదా కొన్ని వంటకాలపై చల్లితే, ఉప్పు రుచి లోటు తెలియకుండా ఆహారానికి మంచి రుచి వస్తుంది. ఉప్పును తగ్గించే ఆహారంలో, పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: