మానవాళిని ప్రస్తుతం అత్యంత భయపెడుతున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ అనేది ఏ వ్యక్తికైనా సోకినట్లయితే ఆ వ్యక్తి అత్యంత ముందు దశ లోనే తనకు క్యాన్సర్ సోకినట్లు గుర్తించి దానికి తగిన వైద్యం తీసుకున్నట్లయితేనే ఆయన క్యాన్సర్ నుండి బయట పడే అవకాశాలు ఉంటాయి. లేక క్యాన్సర్ వచ్చాక చాలా కాలం పాటు తెలియకుండా దాని స్టేజ్ దాటి అది చాలా ముదిరిన తర్వాత అది వచ్చింది అని తెలిసిన ఏవి చేయలేని పరిస్థితి ఉంటుంది. దాని ద్వారా వ్యక్తి మరణించే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. ఇక క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రబలి పోయి ఎంతో మంది మరణాలకు దారి తీస్తూ ఉండడం తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సైంటిస్టులు క్యాన్సర్ కు మందు ను కనుకునే పని లో నిమగ్నమయ్యారు. ఇకపోతే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో వచ్చినట్లు కనుక్కున్నట్లయితే మందులు ఉన్నా కూడా అది తీవ్రంగా ముదిరిన తర్వాత మాత్రం దానిని తగ్గించడం చాలా కష్టంగా మారింది.

ఇకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత మందు కనుక్కోవడం కంటే కూడా ఒక సైంటిస్ట్ అసలు క్యాన్సర్ రాని జంతువులు ఏవి ..? వాటికి ఎందుకు క్యాన్సర్ రావడం లేదు ..? అనే దానిపై పరిశోధనలు నిర్వహించాడు. తాజాగా ఫిజీషియన్ పట్రిక్ అనే శాస్త్రజ్ఞుడు ఏనుగులలో క్యాన్సర్ రాదు అని , వాటికి మనుషులలో ఒక పొర ఉండే స్థానంలో ఎనిమిది పొరలు ఉంటాయి అని అందుకే ఏనుగులు క్యాన్సర్ బారిన పడటం లేదు అని ఆయన నివేదికలో పేర్కొన్నాడు. అలాగే కరోనా వచ్చినప్పుడు కూడా ఏనుగులకు కరోనా సోకలేదు అని ఆయన తన తాజా నివేదికలో నివేదించాడు. ఇలా తాజాగా ఈ సైంటిస్ట్ ఏనుగులకు క్యాన్సర్ రాదు అని ,  అందుకు గల కారణం మనుషులకు ఒక పొర ఉండే స్థానంలో వాటికి ఎనిమిది పనులు ఉండడం వల్ల ఏనుగులను క్యాన్సర్ అటాక్ చేయలేక పోతుంది అని ఆయన తన తాజా నివేదికలో పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: