ప్రస్తుతం నాగచైతన్య తన 24వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఓ తమిళ్ దర్శకుడితో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో శోభిత – చైతన్య జంటగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయడానికి ఓకే అయ్యారట. ఇది నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శివ నిర్వాణ – నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలీ’ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ కాంబినేషన్, ఇప్పుడు రియల్ లైఫ్ భార్యాభర్తలుగా మారిన నాగచైతన్య – శోభితతో కలిసి వస్తే… ఆ మ్యాజిక్ డబుల్ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
“మజిలీ కంటే రెట్టింపు హిట్ అవుతుంది”,“ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని పూర్తిగా ఆకట్టుకుంటుంది”,“నిజంగా ఇదే జరిగితే థియేటర్లు షేక్ అవుతాయి”అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వార్తే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్‌గా మారిపోయింది.అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దర్శక నిర్మాతల నుంచి క్లారిటీ వస్తే, ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడం ఖాయం. నాగచైతన్య – శోభిత ధూళిపాల జంట తొలిసారి వెండితెరపై ఎలా కనిపించబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా తెరపైకి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొద్దిరోజులు వేచి చూడాల్సిందే. కానీ ఇప్పటికి మాత్రం… ఈ వార్త టాలీవుడ్‌లో ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోందన్నది మాత్రం నిజం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి