- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మ్యాచో స్టార్ టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ # గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం  గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్ర బృందం భారీ, హై ఇంటెన్సిటీ క్లైమాక్స్ సీక్వెన్స్ ని షూటింగ్‌ను ప్రారంభించింది. రాత్రిపూట చిత్రీకరించే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. దీనిని 25 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారు.  

 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ క్లైమాక్స్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, స్కేల్,  ఎగ్జిక్యూషన్ పరంగా ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్‌గా ఉండబోతుంది. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించనుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్,  గ్లింప్స్‌లో, పొడవైన జుట్టు, రగ్డ్ గడ్డం, వారియర్ గెటప్‌లో కనిపించడం భారీ అంచనాలను పెంచింది. ఇన్నోవేటివ్ కథనాలు, టెక్నికల్ ఫినెస్‌కు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది. గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు.


ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌, అనుదీప్ దేవ్ సంగీత అందిస్తున్నారు. నటీనటులు: టి గోపీచంద్, సాంకేతిక నిపుణులు దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్ , సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్ , ఎడిటర్: చోటా కె ప్రసాద్ , ఫైట్ మాస్టర్స్: వెంకట్, పృథ్వీ, రియల్ సతీష్ , డ్యాన్స్ మాస్టర్స్: శంకర్, విజయ్ పోలంకి
పీఆర్ఓ: వంశీ-శేఖర్ , మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట

మరింత సమాచారం తెలుసుకోండి: