మ్యాడ్ ,మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలలో నటించి అద్భుతమైన నటనతో బాగానే పేరు సంపాదించారు యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్. ఇప్పుడు మొదటిసారి సోలో హీరోగా వెండితెరకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ చిత్రమే రాకాస. ఈ చిత్రాన్ని మానస శర్మ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. అలాగే జి స్టూడియో సమర్పణలో రాబోతోంది. ఏప్రిల్ మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.


ఇందులో భాగంగా తాజాగా రాకాస గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. గ్లింప్స్ విషయానికి వస్తే.. యుగయుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య ఆ సమస్యను చేదించడానికి ఒక వీరుడు వస్తాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తారు అంటూ చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. ఇక ఈ కథలో వీరుడుని నేనే అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్ తో సంగీత్ శోభ ఎంట్రీ ఇవ్వగా చివరికి అది కామెడీ వైపుగా టర్ను తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు ఈ సినిమా కామెడీ మరొకవైపు ఏదో మిస్టరీ చేదించే సినిమాలా కనిపిస్తోంది.



ఈ సినిమాకి ప్రధాన బలం కామెడీ అన్నట్టుగా గ్లింప్స్ అర్థమవుతోంది. సరికొత్త అంశంతో సరికొత్త గా మేకర్స్ చూపించడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో నయన్ సారిక, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఆశీష్ విద్యార్థి తదితరనటి నటులు ఇందులో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన రాకాస గ్లింప్స్ తో సినిమా పైన మరింత అంచనాలను  పెంచేస్తోంది. మరి ఈ సినిమా సంగీత్ శోభన్ కెరియర్ కు ఏ విధంగా సక్సెస్ ని తీసుకువస్తుందో చూడాలి మరి. ప్రస్తుతమైతే గ్లింప్స్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: