రధ సప్తమి అంటే ఏమిటి?
మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి నాడు రధ సప్తమి జరుపుకుంటారు.ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణంలో పూర్తిగా స్థిరపడతాడు. సూర్యుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణం ప్రారంభించాడని పురాణ కథనం
అందుకే దీనిని రథ సప్తమి అంటారు.
పురాణ కథ
కశ్యప మహర్షి కుమారుడు అయిన సూర్యుడు, లోకానికి వెలుగు, జీవశక్తి ఇవ్వడానికి ఈ రోజున తన రథయాత్రను ప్రారంభించాడని పురాణాలు చెబుతాయి.
ఏడు గుర్రాలు = ఏడు వర్ణాలు,ఏడు ఛందస్సులు, ఏడు వారాలు
ఈ రోజు ఎందుకు ముఖ్యమంటే?
సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి. ఈ రోజు సూర్యారాధన చేస్తే దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం, రోగనివారణ, పాప విమోచనం కలుగుతాయని నమ్మకం
రధ సప్తమి రోజున ఏం చేయాలి?
అరుణోదయాన్నే స్నానం:
ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి. తలపై ఎర్ర జిల్లేడు ఆకులు (లేదా) నేరేడు / రావి / జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయడం విశేషం. దీనిని పత్రస్నానం అంటారు
సూర్యారాధన:
స్నానం తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి (నీటిలో ఎర్ర పువ్వు, అక్షింతలు వేసి)
మంత్రం (సాధారణంగా):
ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః
సూర్య నమస్కారాలు:
కనీసం 7 లేదా 12 సూర్య నమస్కారాలు చేస్తే మంచిది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విశ్వాసం
పూజ విధానం:
సూర్యుడి చిత్రానికి లేదా విగ్రహానికి..ఎర్ర పువ్వులు,గంధం,దీపం నైవేద్యం (పాయసం / బెల్లం వంటకాలు)
దానం:
ఈ రోజున దానం చేస్తే చాలా పుణ్యం:
బెల్లం,బియ్యం, ఎర్ర వస్త్రం,రాగి పాత్ర, గోధుమలు. ముఖ్యంగా బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేయడం శుభం
నైవేద్యం / భోజనం:
బెల్లంతో చేసిన పాయసం,పొంగలి, నువ్వులు, బెల్లం కలిపిన వంటకాలు
రధ సప్తమి ఫలితాలు:
సూర్య గ్రహ దోష నివారణ..ఆరోగ్య వృద్ధి..నేత్ర సంబంధిత సమస్యలు తగ్గడం..కుటుంబ శాంతి, శుభఫలితాలు
ప్రత్యేక నమ్మకం:
*రధ సప్తమి ఒక్కరోజే చిన్న మకర సంక్రాంతిలా పరిగణిస్తారు
*ఈ రోజున సూర్యుడు పూజించబడితే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అని శాస్త్ర వచనం..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి