కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి ఒక సర్వేలో భారీ బంగారు నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో  ఉండే కదిరి ప్రాంతంలో ఉన్నట్లుగా తేలడం జరిగింది. దీంతో ఇప్పుడు కదిరి ప్రాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంక్షంగా మారింది. అయితే అక్కడ ప్రాథమిక అంచనా  ప్రకారం ఈ ప్రాంతం భారత గనుల చరిత్రలో చాలా సుప్రసిద్ధమైనటువంటి కోలార్ గోల్డ్ ఫిష్ (KGF ) తరహాలోనే  ఇక్కడ బంగారం ఉండబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో అక్కడ స్థానికులు సైతం ఈ విషయం పైన మరింత ఆసక్తికరంగా చూస్తున్నారు.


కదిరి బెల్ట్ భూగర్భంలో దాగివున్న ఈ బంగారు ఖనిజ  సంపాదను గుర్తించేందుకు ఏరియల్ స్పెక్ట్రోమెట్రిక్ డేటా మ్యాపింగ్ ప్రక్రియను ఉపయోగించారు. ముఖ్యంగా ఖనిజాల లోతు పరిమాణం మరియు విస్తృతిని ఇది అంచనా వేసేలా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం కదిరి పరిసరాలలో సుమారుగా 10 ప్రాంతాలలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా అధికారులకు గుర్తించారు. మొత్తం 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నదని సుమారుగా 16 టన్నుల బంగారం నిధి ఉన్నట్లుగా అక్కడ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.


భూమి లోపల ప్రతి 50 కిలోమీటర్లకు లోతున బంగారు పొరలు వరుసగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టన్ను ఖనిజానికి సుమారుగా నాలుగు గ్రాములు బంగారం లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ గనులు తవ్వడానికి కూడా అనువైనదిగా ఉన్నదంటు తెలియజేస్తున్నారు. ఈ బెల్ట్ ప్రక్రియను ఇలాగే అభివృద్ధితో కొనసాగిస్తే ఈ ప్రాంతపు పారిశ్రామిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు కేంద్రంగా మారుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అటు కదిరి ప్రాంతవాసులు వీటి అభివృద్ధి పైన మరిన్ని ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు సైతం తదుపరి పరిశీలన కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP