విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదని చిరంజీవి పట్టు పట్టినట్లుగా వినిపిస్తున్నాయి. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా విశ్వంభర సినిమా గురించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి మరోసారి అప్డేట్ రాబోతోందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. అద్భుతమైన విజువల్స్ తో కూడిన ఒక వీడియో టీజర్ ని చిత్ర బృందం త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో విశ్వంభర సినిమాని మరింత రెట్టింపు చేసేలా ఉంటుందని వినిపిస్తున్నాయి.
విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మరి కొంతమంది హీరోయిన్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి విజువల్స్ వండర్గా తెరకెక్కించేలా డైరెక్టర్ వశిష్ఠ ప్లాన్ చేస్తున్నారు. గతంలో విశ్వంభర సినిమా నుంచి విడుదలైన టీజర్ వల్ల చిరంజీవి పైన చాలానే ట్రోల్స్ ఎదురయ్యాయి. దీంతో గ్రాఫిక్స్ విషయంలో చిత్ర బృందం ప్రత్యేకించి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఇంత ఆలస్యం అవుతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అప్డేట్ తోనైనా ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి