ఫిబ్రవరి 26వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్రలోకి వెళితే ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 గాలిపటాలు మ్యూజియం : భారత్లో మొదటి సారి గాలిపటాల మ్యూజియం 1975 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభించబడింది.ఇది అహ్మదాబాద్లో ఉంది. 

 

 విక్టర్ హ్యూగో జననం : సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత కవి నాటక రచయిత వ్యాసకర్త ఆయన విక్టర్ హ్యూగో 1802 ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. ఈయన ఫ్రెంచి భాషలో ఎన్నో నవలలు రాశారు. ఈయన రాసిన నవలలు ఎంతో ప్రేక్షకాదరణ కూడా పొందాయి. ఆయన 1885 సంవత్సరంలో పరమపదించారు. 

 

 లెవీ స్ట్రాస్ జననం : బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్  అండ్ కో సంస్థ స్థాపకుడు లెవీ స్ట్రాస్  1829 ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. 

 

 హేమలత లవణం జననం : పద్మభూషణ్ అవార్డు గ్రహీత జాషువా కుమార్తె సామాజిక సేవకురాలు అయినా హేమలతా లవణం 1932 ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. జోగిని లను వారి పిల్లలను ఆదుకోవడానికి సంస్కార్ చెల్లి నిలయం అనే సంస్థను ఏర్పాటు చేసింది. జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న దృఢసంకల్పంతో వాటన్నింటినీ ముద్రించింది హేమలతా లవణం. 

 

 

 శివాజీ రాజా జననం : తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శివాజీరాజా కొసమెరుపు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్గా హీరోగా కూడా నటించారు శివాజీ రాజు. ఇప్పుడు వరకు శివాజీరాజా 260 చిత్రాలకు పైగా నటించారు. కాగా శివాజీరాజా 1962 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ... ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శివాజీ రాజా. పెళ్లిసందడి సిసింద్రీ ఘటోత్కచుడు మురారి శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ధారావాహికల్లో  ఎక్కువగా పాపులర్ అయిన అమృతం సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడ్ లలో  ప్రధాన పాత్ర అయిన అమృతం  పాత్రను పోషించారు శివాజీ రాజా. మరికొన్ని ధారావాహికలో కూడా నటించారు. ఇక మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా శివాజీరాజా పనిచేశారు. 

 

 ఎలక వేణుగోపాల్ రావు జనం : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు ఎలక వేణుగోపాలరావు 1982 ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. ఇతను భారత జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా రంజీలలో  ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం టి20లలో  సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. 

 

 అయ్యదేవర కాళేశ్వరరావు మరణం : ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాపతి అయిన అయ్యదేవర కాళేశ్వరరావు 1962 ఫిబ్రవరి 26వ తేదీన మరణించారు.  ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్ర లో జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: