పాము..... ఆ పేరు వినగానే ఒళ్లంతా ఒక్కసారి జిలవరిస్తుంది. అంతే కాదు పాము కనపడగానే... మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. అయితే మన దేశంలో చాలా రకాల పాములు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అతి భయంకరమైన పాములు ఏంటో ఇవ్వాళ తెలుసుకుందాం.

సముద్రపు పాము : ఈ సముద్ర పాములు ఎక్కువగా మనకు ఉత్తర ఆస్ట్రేలియా మరియు ఆగ్నేయాసియాలో విస్తారంగా కనబడుతాయి. ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది. ఈ పాము విషము కొన్ని మిల్లీగ్రాముల చుక్కలు మాత్రమే. కానీ ఈ పాముకాటుకు దాదాపు వెయ్యి మంది మనుషులు మృతి చెందుతారు. ఈ పాములు ఎక్కువగా సముద్రంలో ఉండటం కారణంగా సామాన్య ప్రజలకు అసలు అగుపించదు.

లోతట్టు తైపాన్ : లోతట్టు తైపాన్ భూమిపై ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో ఒకటి. ఈ పాము కాటుకు దాదాపు 100 మందికి పైగా మనుషులు చనిపోతారు.  ఈ పాము విషం... నాగుపాము కంటే 50 రేట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తూర్పు బ్రౌన్ స్నేక్ : తూర్పు బ్రౌన్ స్నేక్ పాములు ఎక్కువగా ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే కనపడుతాయి. ఈ పాము అత్యంత విషపూరితమైన ది. ఈ పాము ఈ విషం లో ఒక్క శాతంతో... మనిషి మరణించే అవకాశం ఉంటుంది.

ఫిలిపినో కోబ్రా : ఈ జాతికి చెందిన పాములు చాలా భయానకమైనది. ఈ పాములు దూరం నుంచే విషాన్ని చిమ్ముతాయి. ఈ పాము కాటువేస్తే... మనిషి గుండెకు నేరుగా విషయం చేరుతుంది. దీంతో ఆ మనిషి ఆ క్షణమే మరణిస్తాడు.

బ్లాక్ మాంబా : ఈ జాతికి చెందిన పాములు అత్యంత ప్రమాదకరమైన లో ఒకటి. ఒక మనిషిని చంపడానికి ఈ పాములు యొక్క ఒక మిల్లీ గ్రాము విషయం చాలును. కానీ ఈ పాము... మనిషి పై దాడి చేస్తే... ఏకంగా 400 మిల్లీగ్రాముల విషాన్ని శరీరంలోకి రిలీజ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: