ఒకనొక గ్రామంలో ఓ అవ్వ తన కొడుకు, కోడలు, మనవడితో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వ బాగా ముసల్ది అయిపోయింది. ఆమెలో శారీరక బలహీనత ఎక్కువ అయిపోయింది. అప్పుడపుడు ఆమె చేతిలోంచి గాజు కప్పులు, గాజు పళ్లేలు జారపడి పగిలిపోతుండేవి. అవి పగిలినప్పుడల్లా కోడలు తన ముసలి అత్తను తిట్టేది. ఇలా తన నానమ్మను తిట్టడం మనవడికి ఇష్టం వుండేదికాదు. కానీవాడు అమ్మను ఏమీ అనలేక పోయేవాడు. ఓ రోజు అవ్వ చేతినుండి నగషీలు చెక్కిన పళ్లెం పడి పగిలిపోయింది. కోడలు కోపగించుకుని, తన కొడుకుని పిలిచి డబ్బులు ఇచ్చి అవ్వకు ఓ చెక్క పళ్లెం కొనుక్కురమ్మని చెప్పంది. వాడెంతో బాధపడ్డాడు. అవ్వ బాధపడుతుందని వాడికి తెలసు అయినా తన అమ్మకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బజారునుండి చెక్క పళ్లాలు తెచ్చాడు. అవి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ‘‘ఒక చెక్క పళ్లెం తెమ్మంటే రెండు ఎందుకు తెచ్చావ్’’ అని కోపంగా అడిగింది. ‘‘ మరెం లేదు ఒకటి అవ్వకి, ను కూడా ముసలి దానివి అయిపోతే నీకు కూడా ఒకటి వుండాలి కదా! అని చెప్పాడు. కోడలికి జ్ఞానోదయమైంది. ఈ రోజు నుండి అత్తగార్నెంతో ప్రేమగా చూసుకోసాగింది కోడలు.  మీ తరంలోని మా తల్లిదండ్రులను వృద్దుల్ని మీరెలాగైతే చూస్తారో... మీ తర్వాత తరం వారు అంటే మీ కొడుకు, మనవలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి: