సాధారణంగా పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.. అయితే వారికి శరీరం ఎదుగుదలకు కావలసిన పోషకాహారాన్ని మాత్రమే ఇస్తూ ఉండాలి అప్పుడే వారి ఎదుగుదల సరిగ్గా ఉండి, బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టకూడదని నిపుణులు అంటున్నారు..అలాంటి ఆయిల్ ఫుడ్స్ , లేదా జంక్ ఫుడ్స్ , కూల్ డ్రింక్స్ వంటి వాటిని పెట్టడం వల్ల శరీరంలో పోషకాలు తగ్గి అనారోగ్యం ఏర్పడుతుందని అంటున్నారు. అయితే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్ట పడతారు.. దీంతో పిల్లల ఎదుగుదల త్వరగా జరుగుతుంది.



ఫ్రూట్స్..


పండ్లలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగివున్నాయి.. అయితే వాటిని ఎక్కువగా పిల్లలకు పెట్టడం వల్ల శరీరంలో మార్పులు రావడంతో పాటుగా అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.. అందుకే పండ్లకు ప్రీతి పాత్రులను చేయాలని అంటారు.. ఎటువంటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..



యాపిల్..


యాపిల్ ను తీసుకోవడం వల్ల మిగ్నిషయం, కాల్షియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ,విటమిన్లు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి.


ఆరెంజ్..


సి, బి విటమిన్లు అధికంగా ఉంటారు.. వీటి వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది వీటిని తీసుకోవడం పిల్లలు చురుగ్గా కూడా ఉంటారు.


సపోటా..

సపోటా తినడానికి తియ్యగా ఉండటం వల్ల పిల్లలు ఈ పండ్లను తినడానికి బాగా ఇష్టపడతారు.. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అంతేకాదు ఆహారం జీర్ణం అవ్వడానికి చాలా బాగా దోహద పడుతుంది.


అరటి పండు..


ఆరోగ్య నిధి ఈ పండు.. పిల్లలకు ముఖ్యంగా శరీరం ఎదుగుదలకు కావలసిన అన్నీ పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి.. అందుకే అంటారు ఏదైనా ఉదర సమస్యలు వస్తే అరటి పండ్లను పెట్టాలని.


వీటితో పాటుగా జామ , సీతాఫలం , పపాయ, ఫైనాఫిల్ ఒకటేమిటి పండ్లు అన్నీ కూడా పిల్లలు శుభ్రంగా తినవచ్చు..


ఆహారం విషయానికి వస్తె ఆయిల్ ఫుడ్స్ కాకుండా గుడ్డు, చేపలు, సమపాళ్లలో మాంసం వంటి వాటిని పెట్టడం మంచిది.. తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలు తొందరగా ఎదుగుతారు.. చూసారుగా వీలైనంతవరకు పండ్లను పెట్టడం చాలా మంచిది..



మరింత సమాచారం తెలుసుకోండి: