చిన్నపిల్లలు ఎక్కువగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే కడుపు నొప్పికి ప్రధాన కారణం మలబద్ధకం, కడుపులో నట్టలు లాంటివి ఉండటం అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆహారపు అలవాట్లు సరిగాలేకపోవుట. వేళకు మల విసర్జనకు వెళ్లే అలవాటులేకపోవటం దీనికి ప్రధాన కారణం. అలాగే కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్‌వల్ల కడుపు నొప్పి వస్తుంటుంది. మల విసర్జనకు వెళ్లాలంటేనే భయంగా ఉండుట. గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండి నొప్పి రావటం. కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావటం. మల విసర్జన సరిగా పూర్తిగాకాక అవస్త పడటం. తిన్నది సరిగ్గా జీర్ణంకాకపోవడం, వాంతులు కావడం.

ఇక పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైన్‌ఆపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా పిల్లలకు పెట్టాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం ఇవ్వడంవలన మల విసర్జన త్వరగా సాఫీగా జరుగును. ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు లాంటివి పిల్లలకు పెట్టకూడదు. కడుపు నొప్పితో పిల్లలు ముడుచుకొనిపోతారు. ఇలాంటి వారికి ఈ మందు ఆలోచించ దగినది. ఈ మందులే కాకుండా మాగ్‌ఫాస్, సల్ఫర్, సైలీషియా, కాల్కేరియా కార్బ్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

హోమియో వైద్యంలో ‘కడుపునొప్పి’తో బాధపడే పిల్లలకు మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడంవల్ల సమస్య సమూలంగా నివారణ అవుతుంది. కడుపునొప్పికి తరుచుగా గురిఅవుతూ మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా ఇష్టపడే పిల్లలకు ఈ మందు బాగా పనిచేయును. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి కడుపునొప్పి నివారణకు ఈ మందు బాగా పనిచేస్తుంది.

అయితే వీరికి దాహం ఎక్కువగా ఉం డును. అయినప్పటికీ మలబద్ధకము కడుపునొప్పితో బాధపడుతుంటారు. మలము గట్టిగా వచ్చును. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది. మలము మెత్తగా ఉన్న వీరు మల విసర్జనకు ముక్కవలసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలలో మలబద్ధక సమస్య నివారణకు ఈ మందు వాడుకోదగినది. అలాగే డబ్బా పాలు తాగే పిల్లల్లో ఏర్పడే మలబద్ధకం మరియు కడుపునొప్పి నివారణకు ఈ మందు బాగా పనిచేయును.

మరింత సమాచారం తెలుసుకోండి: