వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
ఎవరు చెప్పినా వినాలి వినగానే తొందరపడక
నిదానంగా ఆలోచించాలి.
అట్లా ఆలోచించి సత్యమేవో? ఆసత్యమేదో?
తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు.
మరింత సమాచారం తెలుసుకోండి: