శరీర బరువును తగ్గించుకోవడానికి ఇంకా ఫిట్‌గా ఉండటానికి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. మీరు మంచిగా తిన్నా కానీ తగినంత నిద్ర లేకపోతే చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. మీ బరువు కూడా అనియంత్రితంగా పెరుగుతుంది. కావున సమయానికి నిద్రపోవడానికి, ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి.శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే తగినంత సూర్యరశ్మిని పొందడం అవసరం. ఈ సూర్యరశ్మి పెరిగిన కొవ్వును తగ్గించి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి పనిచేస్తుంది. సూర్యుని కిరణాలు చర్మం లోపల కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందువల్ల, వీలైనంత వరకు, ప్రతిరోజూ కాసేపు సూర్యరశ్మికి ఉండేందుకు ప్రయత్నించాలి.శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో మీ అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు ప్రోటీన్ కలిగిన తేలికపాటి అల్పాహారం తీసుకోండి. అటువంటి అల్పాహారం మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. దీని కారణంగా మీకు త్వరగా ఆకలి అనిపించదు. ఇంకా అతిగా తినకుండా ఉంటారు.


మీకు కావాలంటే ఉదయం అల్పాహారంలో గుడ్లు, పోహా, గింజలు లేదా మొలకెత్తిన తృణధాన్యాలను తీసుకోవచ్చు.పొద్దున్నే ఫ్రెష్ అయ్యాక రోజూ కనీసం అరగంట పాటు యోగా చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా యోగాలో సూర్య నమస్కారాలు చేయండి. ఈ వ్యాయామం శరీరంలోని 13.91 కేలరీలను బర్న్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రోజూ 30 నిమిషాలపాటు యోగా, సూర్య నమస్కారాలు చేయడం వల్ల 270-280 కేలరీల బర్న్ చేయవచ్చు. దీని వల్ల పెరిగిన బరువు త్వరలోనే నియంత్రణలోకి వస్తుంది. ఇంకా నడకను అలావాటు చేసుకోవడం, వ్యాయామం చేయడం మంచిది.ప్రతిరోజూ మీరు ఉదయం నిద్రలేవగానే.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని అంతర్గత జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. పొట్ట కూడా సరిగ్గా శుభ్రమవుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: