ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యవసాయ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే రైతుల కోసం సరికొత్త వంగడాలను కూడా పండిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాకుండా దేశం మొత్తం ఎక్కువగా ఆధారపడే వాటిలో వరి కూడా ఒకటి. ఇందులో పలు రకాల బియ్యం ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నల్లబియ్యం లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నల్లబియ్యం లో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉండడం వల్ల ఇవి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.. ముఖ్యంగా ఇందులో విటమిన్ -E అధికంగా ఉండడం తో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాల వల్ల క్యాన్సర్ల వారి నుండి విముక్తి కలిగించేలా చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. నల్ల పియం డైయాబెటిస్ వ్యాధిగ్రహస్తులకు పలు ప్రయోజకరంగా ఉంటాయట. ఇందులో ఉండే ఫైటర్ కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచి మన శరీరానికి అనుగుణంగా గ్లూకోస్ ను మార్చేలా చేస్తాయట.


వారంలో ఒకసారి అయినా ఈ నల్లటి బియ్యాన్ని తీసుకోవడం వల్ల 40 శాతం వరకు ఫైబర్ మన శరీరానికి అందుతుందట. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన శరీరంలో బ్యాక్టీరియాతో పోరాటం చేసి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇందులో ఉండే పోషకాల వల్ల మన శరీరంలో ఉండే చెడు కొవ్వును సైతం కరిగిస్తుంది. ఈ బియ్యం తరచూ తిన్నవారు రక్తపోటు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అయితే మార్కెట్లో వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్న పలు ఉపయోగాలు కూడా అంతకంటే ఎక్కువగా ఉంటాయని. అయితే సాధారణ బియ్యంతో పోలిస్తే ఇవి పోషకాలలో కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుచేతనే తరచూ కాకుండా అప్పుడప్పుడైనా కనీసం వీటిని తింటూ ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: