సాధార‌ణంగా తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందు వరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. అయితే కొందరు తమకు నచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. అలాగే ముఖ్యంగా రాత్రిపూట ఆల‌స్యంగా భోజ‌నం చేయ‌డం అంత మంచిది కాదు. రాత్రిపూట బాగా ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్ర పోవడం, లేకపోతే ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతారని తెలిసిన విషయమే. 


అలాగే ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయ‌డం వ‌ల్ల క్యాన్సర్ వస్తందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. రాత్రిపూట 9 గంటల తరువాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని గుర్తించారు. అలాగే 9 లోపు భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 26 శాతం వరకు తక్కువగా ఉంటాయని, అలా కాకుండా ఇంకా ముందే భోజనం చేస్తే ఆ అవకాశం 16 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. 


ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. మ‌రియు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ , గుండె జబ్బులు వస్తాయి. అయితే రాత్రి నిద్ర‌పోవ‌డానికి క‌నీసం మూడు నాలుగు గంటల ముందే ఆహారం తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీనివ‌ల్ల ఆహారం స‌రిగ్గా అరిగిపోవ‌డంతో పాటు క్యాల‌రీలు కూడా క‌రిగే అవ‌కాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: