ప్రస్తుత రోజుల్లో ఓట్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగనిస్తున్నారు. ఎందుకంటే ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు ఉన్న‌వారికి మేలు చేస్తాయి. అందుక‌నే ప్ర‌స్తుతం వైద్యులు, న్యూట్రిష‌నిస్టులు ఓట్స్‌ను ఆహారంగా తీసుకోవాల‌ని చెబుతున్నారు. ఓట్స్‌లో ఉండే ప్రోటీన్లు కండ‌రాల‌కు బ‌లాన్నిస్తాయి. కేవ‌లం 8 టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తింటే చాలు మ‌న‌కు రోజు మొత్తంలో కావల్సిన ప్రోటీన్‌లో 15 శాతం వ‌ర‌కు అందుతుంది. మధుమేహగ్రస్తులకు మరియు హై బ్లడ్ ప్రెజర్ ఉన్నపేషంట్స్ కు ఓట్స్ ఒక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి ఆహారపదార్థం.


ఎందుకంటే ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి దుర‌ద‌లు, వాపులు, హైబీపీని త‌గ్గిస్తాయి. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. దీంతో మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే విట‌మిన్ ఇ, గ్లూట‌మైన్ వంటి పోష‌కాలు ఓట్స్‌లో స‌మృద్ధిగా ఉంటాయి.  అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఓట్స్ మంచి ఆహారం. కొద్దిగా ఓట్స్‌ను తిన్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఓట్స్ లో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. దీంతో.. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది.


ఓట్స్ చాలా ఆరోగ్యకరమైనవి వీటితో పాటు ఆరోగ్యకరమైన పండ్లను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మరింత రుచికరంగా మరియు పూర్తి న్యూట్రిషియన్స్ అందుతాయి. ఓట్స్‌లో పిండి ప‌దార్థాలు కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తిని అందిస్తాయి. నిత్యం మ‌నం 25 నుంచి 35 గ్రాముల మోతాదులో ఫైబ‌ర్ తీసుకోవాలని న్యూట్రిష‌నిస్టులు సూచిస్తున్నారు. అది మ‌న‌కు ఓట్ మీల్ ద్వారా ల‌భిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: