మనం ఎలా బతకాలి.. ఇదేంటి.. ఇదేం ప్రశ్న అంటారా.. దేనికైనా క్లారిటీ కావాలి కదా. అందుకే ఈ ప్రశ్న. మనం ఎలా బతకాలి అంటే చాలా మంది చెప్పే సమాధానం మనకు నచ్చినట్టు బతకడం.. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అలాగే చెప్పినంత మంచి పద్దతి కూడా కాదు. మనకు నచ్చినట్టు అంటే స్వేచ్ఛగా అనుకుంటారు చాలా మంది.

 

 

కానీ.. ఇక్కడే ఓ విషయం గమనించాలి. స్వేచ్ఛకూ, ఇచ్చకూ తేడా ఉంది. ఇచ్ఛ అంటే

కోరిక. అది పరిమితమైంది. ఇచ్ఛతో ఉండటమంటే, ఏదైనా ఒకటి కావాలని కోరుకోవడం. కోరుకున్నది దక్కినప్పుడు దాన్ని చేతులతో దగ్గరకు తీసుకోవడం. అంటే ఒక విధంగా ఇది ముడుచుకోవడం.

 

 

మరి స్వేచ్ఛ.. ఇది ఆకాశమంత విశాలమైంది. స్వేచ్ఛ అంటే.. విచ్చలవిడితనం కాదు. హద్దు పద్దూ లేకుండా ఇష్టారీతిన బతికేయడం అంతకన్నా కాదు. స్వేచ్ఛకు, ఇచ్ఛకు మధ్య చాలా భేదముంది. ఇచ్ఛ ముడుచుకుపోవడం అయితే స్వేచ్ఛ విచ్చుకోవడం. ఎందుకంటే.. స్వేచ్ఛ అంటే కట్టుకున్న చేతులు రెండూ విప్పేసి విశాలంగా పరచడం. అంటే వ్యాకోచించడం.

 

 

ఉదాహరణకు దాతృత్వ గుణం ఉన్నవాళ్లు దానం చేసేటప్పుడు వారి చేతులు విచ్చుకుంటాయి. ప్రేమ పంచుతున్నపుడు మన హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి. బహుశా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. స్వేచ్ఛకు విచ్చలవిడి తనానికీ తేడా. ఈ తేడా తెలియకపోతే.. జీవితం విచ్ఛలవిడి తనం వైపు మొగ్గుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: