సాధార‌ణంగా అన్నింటికంటే వివాహ‌బంధం అనేది చాలా ముఖ్యమైనది.  పెళ్లి ద్వారా ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి బతకాలి. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకం. అయితే ఈ ప్రయాణానికి నమ్మకం, విశ్వాసం మొదటి అడుగులు కావాలి. ఎందుకంటే మీరు నమ్మే వ్యక్తిని ప్రేమించడం చాలా తేలిక. కానీ, నిజాయితీ లేని వివాహబంధంలో భయం, అభద్రతా భావం సులువుగా ప్రవేశిస్తాయి. ఆ తర్వత మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న అబద్ధాలైనా, దాచిన రహస్యాలైనా మీకు మీ ఆనందాన్ని దూరం చేస్తాయి. ఈ క్ర‌మంలోనే రిలేషన్‌షిప్ మొదట్లో ఉన్నంత ప్రేమగా.. రాను రాను ఉండదు. 

 

ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరికి మొదలైనా మిగతావారికి కూడా దానిపై విసుగు వస్తుంది. కాబట్టి, అలా కాకుండా చూసుకోవాలి. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. గతంలో పెళ్లి నిశ్చయమైన తరువాత, పెళ్లిలోపు వధూవరులు కలుసుకునే సందర్భాలు, మనసువిప్పి మాట్లాడుకునేంత సమయం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంగేజ్ మెంట్ అయిందంటే.. ఇక పెళ్లికి ముందు వరకూ ఆ జంట ఆనందానికి హద్దుండదు. కాబోయే భార్యతో షాపింగులు, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్లు ఇలా ఏదో ఒక ప్రోగ్రామ్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ క్ర‌మంలోనే జీవిత భాగస్వామిని మెప్పించేందుకు మ‌గ‌వాళ్లు కొన్ని అబద్ధాలు చెబుతారన్నది మానసిక వైద్యలు అంటున్నారు. మ‌రి ఆ అబద్ధాలు ఎలా ఉంటాయి..? అన్నిది ఇప్పుడు తెలుసుకుందాం. 

 

నేను ఇంతవరకూ ఒక్క అమ్మాయిని కూడా చూడలేద‌ని చెబుతుంటార‌ట‌.  నాకు కట్నాలు, కానుకలు వద్దు. ఒక్క జత బట్టలతో మా ఇంటికి వచ్చినా చాలని అంటార‌ట‌. అలాగే, నీ వాళ్లు నీకెంతో నాక్కూడా అంతే, వారందరి బాధ్యతా నాపై కూడా ఉంటుంది. పెళ్లి తరువాత నిన్ను కష్టపెట్టనులే. నీ పనుల్లో నేను కూడా సహాయపడతా. నా కళ్లతో చూడు. నువ్వు నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావో. నీతో పాటు తిరుగుతుంటే ఎంత బాగుందో... మరెవరితో వెళ్లినా ఇలా అనిపించదు.. ఇలాంటి అబద్ధాలు మ‌గ‌వాళ్లు ఎక్కువ‌గా చెడుతుంటార‌ట‌. అయితే ఇటువంటి మాటలు మనసులో ఏ దురుద్దేశం లేకుండా చెప్పే అబద్ధాలేనని, వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు. మ‌రి ఇవ‌న్నీ కాక‌పోయినా.. వీటిలో కొన్ని అయినా మీరు మీ లైఫ్‌లో ఫేస్ చేసే ఉంటారు క‌దా.. ఒక‌వేళ చేయ‌క‌పోతే మీరు ఇంకా అదృష్ట‌వంతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: